Tv424x7
PoliticalTelangana

ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నాడు డీసీపీ తన కార్యాలయంలో ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఈ కేసులో డైరక్టర్‌ను విచారణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్లు, ఫర్నిచర్ మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మిస్సింగ్ చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్‌ను విచారణ చేసి, స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయాల్లో ఫర్నిచర్ మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశాం. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలో బిర్వాలు మిస్సింగ్‌పై కూడా కేసు నమోదు చేశాం.విద్యా శాఖలో జరిగిన సంఘటన పై దర్యాప్తు జరుగుతుంది. మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విచారణలో ఎవరి ప్రమేయం ఉన్న చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు..

Related posts

ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్

TV4-24X7 News

tv9 విలేకరికి బెదిరింపులు ఎస్పీ కి ఫిర్యాదు

TV4-24X7 News

10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

TV4-24X7 News

Leave a Comment