Tv424x7
Andhrapradesh

డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది, రాష్ట్రజోన్ జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారిగా మెరిట్ లిస్టును ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్సైట్ లోను సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో నూ అందుబాటులో ఉంచామని డిఎస్సి కన్వీనర్ ఎం.వీ కృష్ణారెడ్డి తెలిపారు.

అభ్యర్థులు ఇలా చేయాలి..వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కన్వీనర్ ఓ ప్రకటనలో సూచించారు. వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందే అభ్యర్థు లు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచను న్నట్లు అధికారులు తెలి పారు. ఒకవేళ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపో యినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించక పోయినా, తగిన విద్యార్హ తలు లేన ట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.జిల్లాల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. 50మంది అభ్యర్థులకు ఒక బృందం ఉంటుంది. కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాల పరిశీ లనకు రెవెన్యూ, దివ్యాంగ సర్టిఫికెట్ల పరిశీలనకు వైద్యులను అందుబాటులో ఉంచను న్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన సోమవారం నుంచి చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకేసారి మొత్తం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయను న్నారు. అయితే, ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వచ్చి ఏదైనా ఒక్క పోస్టును ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత అభ్యర్థిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు.

Related posts

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

TV4-24X7 News

పల్నాడు జిల్లా లో సిట్టింగులకు ఎసరు – వైసీపీలో కలకలం

TV4-24X7 News

పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి : పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

TV4-24X7 News

Leave a Comment