హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లను(Passport counters) ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ తెలిపారు..సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో డిసెంబర్ 13, 15, 18 తేదీలలో ప్రత్యేక కౌంటర్‌లు అందుబాటులో ఉంటాయని, హజ్ యాత్రికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా పంపించిన పాస్‌పోర్టు దరఖాస్తులు మాత్రమే ఈ కౌంటర్‌లలో పరిశీలిస్తారని తెలిపారు.
