హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరగనుంది. 119 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను బీఆర్ఎస్ అధినేత నియమించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు తెలంగాణ భవన్లో ఐటీ నిపుణులతో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. సభ్యత్వ నమోదు కోసం డిజిటల్ యాప్‌ను రూపొందించారు. తెలంగాణ భవన్లో శిక్షణ తర్వాత.. పార్టీ జిల్లా కార్యాలయాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు.పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన తర్వాత.. సభ్యత్వ పునరుద్ధరణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు..

