Tv424x7
Telangana

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

..హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది..మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రమంలో దిగి.. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. గంటపాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపనున్నారు..సాయంత్రం 3.05 గంటలకు అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 3.50 గంటలకు కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌కు వెళతారు. గంటన్నర పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు కొంగరకాలన్ నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. హోటల్‌లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభపక్ష నేతను ఎంపిక చేయనున్నారు. 6.50 గంటలకు అమిత్ షా తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు..

Related posts

తోకతో పుట్టిన బాలుడు.. తొలగించిన వైద్యులు

TV4-24X7 News

పిడిఎస్ రైస్ అక్రమ దందాలో తాండూర్ ఎస్సై సస్పెన్షన్

TV4-24X7 News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment