కడప /ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ఎన్నీకల ప్రచారం మొదలు పెట్టనున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక నడింపల్లి వీధి లోని 17 వ వార్డు కౌన్సిలర్ చరితా రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడవ సారి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. కరోనా కాలంలో ఏ ఒక్క తెలుగు దేశం పార్టీ నాయకులు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాకంటే నాకంటూ టికేట్ కోసం తాపత్రయం పడటం తప్ప ప్రజల కోసం ఏ తెలుగు దేశం పార్టీ నాయకులు లేరని స్పష్టం చేశారు. తమ కౌన్సిలర్ లను ప్రలోభాలు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజాసేవ కోసమే రాచమల్లు వున్నాడని ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని వివరించారు.

previous post