ప్రొద్దుటూరు మునిసిపాలిటీ పరిధిలోని 9వవార్డు నందు మైనార్టీ నాయకుడు గఫార్ ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం తెదేపా మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వైకాపాలో వార్డు ఇన్చార్జ్ గా పనిచేసిన రఫీక్ వారి కుటుంభసభ్యులతోపాటు 200మంది కార్యకర్తలు తెలుగుదేశంపార్టీలో చేరడం జరిగినది , వారందరికీ పార్టీ కండువలు వేసి ఆహ్వానించిన అభ్యర్థి వరదరాజులరెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి,మాజీ ఎంపిపి నంద్యాల రాఘవరెడ్డి అనంతరం పార్టీలో చేరిన నాయకుడు రఫీక్ మాట్లాడుతూ వైసిపిపార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అయినా తగిన గౌరవం అక్కడ లేదని స్థానిక నాయకత్వం బాగాలేకే తెలుగుదేశంపార్టీలో చేరానని గతంలో వరదరాజులరెడ్డి గారి పాలన చూసామాని ప్రొద్దుటూరులో అభివృద్ధి జరగాలన్న శాంతిభద్రతలు ఉండాలన్న వరదరాజులరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండాలని వార్డులో కస్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా పెద్దాయనను గెలిపించుకుంటామని చెప్పారు**వార్డు నందు తెదేపా చేరిన ప్రధాన నాయకులు షఫీ బాబా పండు జాకిర్ హెష్యాన్ షరీఫ్ సుభహాన్ మస్తాన్ షఫీ సతీష్ ఉసేనయ్యా సాదిక్ నూర్ బాషా తదితరులు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మాజీ జెడ్పిటిసి తోటా మహేశ్వరరెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ టప్పా మహబూబ్ బాషా, జనసేన నాయకులు సుంకర మురళి పాల్గొన్నారు

previous post