హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయం అయినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్యుల పరీక్షల అనంతరం 6 నుంచి 8 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వైద్యుల సలహా మేరకు కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి తన సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: