హైదరాబాద్, జూలై 30: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుండగా, తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ):
– ఎస్ఐ (సివిల్) – 148
– ఎస్ఐ (ఏఆర్) – 14
– టీజీఎస్పీ ఎస్ఐ – 12
– ఎస్ఏఆర్సీపీఎల్ ఎస్ఐ – 3
– ఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23
కానిస్టేబుల్ పోస్టులు:
– కానిస్టేబుల్ (సివిల్) – 3,697
– కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
– పీటీవో కానిస్టేబుల్ – 20
– కానిస్టేబుల్ మెకానిక్ – 7
– స్పెషల్ పోలీస్ – 44
– ఇతర కానిస్టేబుల్ పోస్టులు – 1,038
అగ్నిమాపక శాఖ:
– స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
– ఫైర్ ఫైటర్ – 751
జైళ్ల శాఖ:
– డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14
– డిప్యూటీ జైలర్ (మహిళ) – 1
– వార్డర్ (పురుషులు) – 196
– వార్డర్ (మహిళలు) – 12
పోలీస్ నియామక మండలి త్వరలో దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలతో పాటు పూర్తి అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష షెడ్యూల్ను ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ను పరిశీలించాలని అధికారులు సూచించారు.