శబరిమల శ్రీ అయ్యప్పస్వామి భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) శుభవార్త తెలిపింది. రానున్న మండల–మకరవిళక్కు యాత్రా సీజన్ నుంచి భక్తులకు అందించే ఉచిత అన్నదాన సేవలను మరింత మెరుగుపరచనున్నట్లు ప్రకటించింది.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ సాంప్రదాయ కేరళ సദ്യను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అందించే కొన్ని వంటకాలను ఇకపై ప్రతి రోజూ వడ్డించనున్నారు.
అన్నదానం మెనూ ఇలా ఉంటుంది:
– ఉదయం అల్పాహారం: ఇడ్లీ లేదా ఉప్మా వంటి దక్షిణాది వంటకాలు.
– మధ్యాహ్న భోజనం: పాయసం, అప్పడంతో కూడిన సాంప్రదాయ కేరళ సദ്യ.

Oplus_16908288
– రాత్రి భోజనం: కొండ ఎక్కిన భక్తులకు తేలికగా అరిగే కేరళ శైలిలో తయారుచేసిన గంజి.
ఈ కొత్త ఏర్పాట్లతో శబరిమల యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన అన్నదాన సేవలు అందనున్నాయని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: