సగిలేరు డ్యాంకు పొంచి ఉన్న ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యంపై సీపీఐ ఆగ్రహం

పోరుమామిళ్ల: పోరుమామిళ్ల సమీపంలోని సగిలేరు డ్యాం ప్రమాదకర పరిస్థితిలో ఉందని సీపీఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాంను పరిశీలించిన సీపీఐ నాయకులు, షట్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, తూములు కంపచెట్లతో మూసుకుపోవడం వంటి సమస్యల వల్ల భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అలాగే రంగసముద్రం చెరువు, పంట కాలువలు ఆక్రమణలకు గురికావడంతో రైతులకు సాగునీరు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్యాం మరమ్మతులు చేపట్టి, కాలువలు, చెరువుల ఆక్రమణలను తొలగించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

డ్యాం భద్రత, సాగునీటి సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని పిడుగు మస్తాన్ హెచ్చరించారు

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *