చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డులో ఉన్న నౌషాద్ కార్ మెకానిక్ షెడ్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రాధికారి జి. శివప్ప ఆధ్వర్యంలోని సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో కార్ ఇంజన్లు, స్పేర్ పార్ట్స్, ఒక కారు పాక్షికంగా దగ్ధమవడంతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని షేక్ నౌషాద్ తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: