సంగారెడ్డి: పెళ్లి పేరుతో ఓ మెకానిక్‌ను మోసం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఆరిఫుద్దీన్ అనే మెకానిక్, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతిని రూ.60 వేల ఖర్చుతో వివాహం చేసుకున్నాడు.అయితే, పెళ్లి జరిగిన మరుసటి రోజే నవవధువు ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యుల నుంచి కూడా స్పందన లేకపోవడంతో, డబ్బుల కోసం ముందే పథకం ప్రకారం ఈ వివాహం చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.పోలీసులు కేసు నమోదు చేసి కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: