ఏపీలో ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త జిల్లా విద్యాశాఖాధికారులను (డీఈవోలు) నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో విద్యా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొత్తగా నియమితులైన డీఈవోలు:

అనంతపురం – ఆయిబ్ హుస్సేన్అ

ల్లూరి సీతారామరాజు – భానుమూర్తి రాజు

ప్రకాశం – సీవీ రేణుక

పశ్చిమ గోదావరి – అనిల్ కుమార్

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ – మహబూబ్ బాషా

అనకాపల్లి – నాగేశ్వరరావు

నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పాఠశాలల నిర్వహణ, విద్యా నాణ్యత పెంపు, పరిపాలనను మరింత బలోపేతం చేయడంలో ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *