దువ్వూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు రేపు మైదుకూరులో నిర్వహించే నిరసన దీక్షకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 గంటలకు మైదుకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగిందని, డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: