చేబ్రోలులో ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్..!
శానిటరీ షాపులో చోరీ కేసు ఛేదించిన పోలీసులు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, దొంగిలించిన ఇత్తడి ట్యాపులు, ఇతర శానిటరీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.సంగం జాగర్లమూడికి చెందిన వెలగపూడి సాయిబాబు గరువుపాలెంలో నిర్వహిస్తున్న VK Engineers శానిటరీ షాపును మార్చి 14న రాత్రి మూసివేశారు. మరుసటి రోజు షాపు తెరవకపోవడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇత్తడి ట్యాపులు, ఇతర శానిటరీ వస్తువులను అపహరించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ ఆదేశాలతో, తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు సూచనల మేరకు పొన్నూరు రూరల్ సీఐ పి. కృష్ణయ్య ఆధ్వర్యంలో చేబ్రోలు ఎస్‌ఐ పి. వీరనారాయణ, సిబ్బంది కేసును ఛేదించారు.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip: