హైదరాబాద్: హయత్‌నగర్‌లో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో సుమారు 730 కిలోల పేస్ట్‌ను సీజ్ చేశారు.
పేస్ట్‌ను అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు అనుమానించిన అధికారులు.. అక్కడ ఉన్న గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పేస్ట్ తయారీలో ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను పరిశీలించిన అనంతరం పేస్ట్ నాణ్యత, కల్తీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా?, పేస్ట్‌లో ఏ పదార్థాలను వినియోగించారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: