ఏపీలో ఇక ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’.. నవజాత శిశువులకు కానుక!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు బేబీ కిట్లు
ఒక్కో కిట్ విలువ రూ.1,400.. ఏటా 2.45 లక్షల మందికి లబ్ధి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే నవజాత శిశువులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కిట్ ధర సుమారు రూ.1,400గా ఉండనుంది.
ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.51.15 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ఈ బేబీ కిట్ల ద్వారా ప్రయోజనం కలగనుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, నవజాత శిశువులకు అవసరమైన ప్రాథమిక వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: