బద్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ..
ఇద్దరు మృతి, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప జిల్లా: బద్వేల్ మండలం మడకలవారిపల్లె సమీపంలోని జాతీయ రహదారి-67పై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాళ్ల లోడుతో నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పట్నం భాస్కర్ (40), తలసారి రమణయ్య (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది.

లారీ డ్రైవర్ గురవయ్య తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *