మైదుకూరులో ట్రిప్పర్‌లో అకస్మాత్తుగా మంటలు

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప జిల్లా | మైదుకూరు: మైదుకూరు మండలం యద్దడుగు కణం వద్ద తెల్లవారుజామున ట్రిప్పర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరుగులు తీశాడు.

కొద్దిసేపటికే ట్రిప్పర్‌కు పూర్తిగా మంటలు అంటుకోవడంతో స్థానిక వాహనదారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ట్రిప్పర్‌లో మంటలు చెలరేగడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

— TV4 24×7

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *