నందలూరు: బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమించారంటూ ఈదరపల్లి గ్రామస్థులు నందలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాలనీ స్థల ఆక్రమణపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
బీసీ కాలనీ స్థలాన్ని పరిరక్షించి, ఆక్రమణలను తొలగించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తహసీల్దార్ కార్యాలయాన్ని తెరవనివ్వబోమని స్పష్టం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈదరపల్లి గ్రామస్థులు హెచ్చరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: