ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె జిల్లా పీలేరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యంతో కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు.
మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. కేసులో నిందితులైన భార్య ఉమాదేవి, చారా సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: