తెలంగాణ: బాలికలను వ్యభిచారంలోకి దింపిన కేసులో సైఫాబాద్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న 33 మందికి వివిధ రకాల జైలు శిక్షలు విధించింది.ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష, 14 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష, మరో 11 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.అదే సమయంలో కేసులో బాధితులైన 9 మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాలికలపై జరిగిన నేరాలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. నిందితులకు కఠిన శిక్షలు విధించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: