బ్రహ్మంగారి మఠంలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. అనంతరం అల్పాహారం పంపిణీ
కడప /బ్రహ్మంగారి మఠం: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను బ్రహ్మంగారి మఠం నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మేకల రత్న కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ బి.ఎస్. నారాయణరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, యల్లటూరు శివారెడ్డి, ఉప మండల అధ్యక్షుడు రాజా నాయుడు, తిప్పన నాగార్జున నాయుడు, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, బద్దెల శ్యాంసుందర్‌రెడ్డి, బండి సుబ్బరాజా, జోగయ్య, అనంతరెడ్డి, శీలం లక్ష్మీ నరసయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ గాజుల రామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: