కార్పొరేట్ బంగారు షాపులకు వ్యతిరేక పోరాటానికి ప్రవీణ్ రెడ్డి మద్దతు

కార్పొరేట్ బంగారు షాపులకు వ్యతిరేక పోరాటానికి ప్రవీణ్ రెడ్డి మద్దతు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

ప్రొద్దుటూరు: నియోజకవర్గంలో కార్పొరేట్ బంగారు షాపులు ఏర్పాటు చేయకుండా చేపడుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బంగారు వ్యాపారుల సంఘం ప్రతినిధులు ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇంచార్జి డా. జి. వీర ప్రవీణ్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా స్థానిక బంగారు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో స్థానికంగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న చిన్న, మధ్య తరహా బంగారు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.వ్యాపారుల సమస్యలను విన్న ప్రవీణ్ రెడ్డి, వారి పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా బంగారు వ్యాపారుల సంఘం ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *