తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో భారీ స్థాయిలో విరాళాలు సమకూరాయి. దాతల దర్శన సౌకర్యాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో, పాత ప్రయోజనాలను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు సమర్పించారు.
కేవలం 10 గంటల వ్యవధిలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో మొత్తం 2,460 మంది దాతలు విరాళాలు అందించినట్లు సమాచారం. వీటి మొత్తం విలువ రూ.97 కోట్లకు చేరింది.
ఈ విరాళాల్లో భాగంగా ఇద్దరు భక్తులు తలో రూ.1 కోటి చొప్పున భారీ మొత్తాన్ని సమర్పించారు. దాతల నుంచి ఇంత భారీ స్థాయిలో ఒకేరోజు విరాళాలు రావడం టీటీడీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.
నిబంధనల మార్పుల నేపథ్యంలో దాతలు తమకు అందుబాటులో ఉన్న పాత ప్రయోజనాలను పొందేందుకు విరాళాలు సమర్పించడంతో ఈ స్థాయిలో భారీ స్పందన కనిపించినట్లు తెలుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: