పులివెందుల: కసనూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్‌ను పులివెందుల టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందితో మాట్లాడి క్యాంప్‌లో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న పరీక్షలు, ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంప్‌కు వచ్చిన ప్రజలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ సహకారంతో ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు బీటెక్ రవి తెలిపారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు స్క్రీనింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
సింహాద్రిపురంలో అక్టోబర్ 6, 7 తేదీల్లో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీటెక్ రవి కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: