దువ్వూరులో ‘బలిజ చైతన్య సదస్సు’ కరపత్రాల ఆవిష్కరణ

ఈ నెల 25న జరిగే సదస్సును విజయవంతం చేయాలని నాయకుల పిలుపు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దువ్వూరు: రాష్ట్రంలో బలిజ కులస్థులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం నాయకులు మిద్దె శాంతి రాముడు తెలిపారు. కడప నగరంలో ఈ నెల 25న నిర్వహించనున్న బలిజ చైతన్య సదస్సు కు సంబంధించిన ప్రచార కరపత్రాలను దువ్వూరులో సంఘం నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బలిజలు తమ హక్కులను సాధించుకోవడానికి ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. బలిజల అభ్యున్నతి, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని బలిజ కుల బాంధవులు, మేధావులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నెల 25న జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాశం లక్ష్మీ నరసయ్య, కార్యక్రమ సమన్వయకర్త పసుపులేటి వెంకటేష్, కాపునాడు జేఏసీ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు సుంకర రవిశంకర్, సమతం రాము, రామాంజనేయులు, పట్టారు అరవింద్, బండి ప్రసాద్, గోపి గిరిబాబు, గాజుల జయరాం, దీటి హరి, దీటి గోపాల్, ముద్దం రమణ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *