ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ కన్నుమూత

తిరుపతి, అక్టోబర్ 7: ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను అలరించిన కిరణ్ కుమార్.. ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *