ప్రకృతి వ్యవసాయంలో జిగురు అట్టలు పెట్టి దోమను అరికట్టాలి

గోపులాపురం గ్రామంలో రైతులకు అవగాహన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గోపులాపురం: ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పంటలకు వచ్చే తెగుళ్లు, పురుగులను నియంత్రించేందుకు జిగురు అట్టలను వినియోగించాలని రైతులకు అవగాహన కల్పించారు. గోపులాపురం గ్రామంలో K. చంద్రమ్మ, FMT ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలు, నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు బెట్టకు గురై ఎండిపోయే అవకాశం ఉందని తెలిపారు. బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు ద్రవ జీవామృతాన్ని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మొక్కలు గాలిలోని తేమను గ్రహించి కొంతవరకు బెట్టను తట్టుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

అలాగే దోమపోటు నివారణకు పసుపు, నీలం, తెలుపు రంగుల జిగురు అట్టలను ఉపయోగించాలని సూచించారు. పసుపు అట్టలకు తెల్లదోమ, నీలం అట్టలకు త్రిప్స్, తెలుపు అట్టలకు పచ్చదోమ ఆకర్షితమవుతాయని తెలిపారు. జిగురు అట్టలకు పురుగులు చిక్కుకోవడంతో వాటి ఉధృతిని నియంత్రించడంతో పాటు పంటలో పురుగుల స్థాయిని గమనించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టవచ్చని వివరించారు.

వరి సాగు చేసిన రైతులకు జిగురు అట్టలను ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ICRPలు సుజాత, వెంకట సురేష్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *