ఉదయగిరి శివరాంకు ఎం.వి. రావు ఫౌండేషన్ పురస్కారం
నెల్లూరు జిల్లా: పాత్రికేయ రంగంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సామాజిక బాధ్యతతో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేత ఉదయగిరి శివరాంకు అరుదైన గౌరవం దక్కింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎం.వి. రావు ఫౌండేషన్ అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
నవంబర్ 15వ తేదీ ఆదివారం నెల్లూరు జిల్లా, కొట మండలం, విద్యానగర్ పోస్టు పరిధిలోని చెండోడు గ్రామంలో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యా, సాంస్కృతిక, కళా రంగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను సత్కరించారు.
ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో సేవలందిస్తున్న ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేత ఉదయగిరి శివరాంకు ఫౌండేషన్ ప్రతినిధులు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.
చిన్న మీడియా సంస్థగా ప్రారంభమైన ఏకే టీవీ న్యూస్ ద్వారా స్థానిక ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా, వైద్య, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉదయగిరి శివరాం తనదైన పాత్రికేయ శైలిని కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
పెద్ద మీడియా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా చిన్న మీడియా సంస్థలు కూడా ప్రజలకు సమర్థవంతమైన సేవలందించగలవనే లక్ష్యంతో ఏకే టీవీ న్యూస్ ముందుకు సాగుతోంది.
పురస్కారం మరింత బాధ్యతను పెంచింది
ఈ సందర్భంగా ఉదయగిరి శివరాం మాట్లాడుతూ, తనకు లభించిన ఈ పురస్కారం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఏకే టీవీ న్యూస్ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, ఛానల్ సిబ్బంది, ప్రేక్షకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు.
బాలల ప్రతిభకు ప్రోత్సాహం
బాలలలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గౌరవించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు, చిన్నారులకు స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, ముప్పవరపు విజయలక్ష్మి, ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేత ఉదయగిరి శివరాం, జబర్దస్త్ యాంకర్ నవ్వుల దామోదర్, నటుడు థాంక్స్ మాస్టర్, పలువురు కళాకారులు, చిన్నారులు, ఎంఈఓ మస్తాన్, సభా ప్రముఖులు, ఇతర అతిథులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: