వరికుంటలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి పలువురు కీలక నేతలు!

ఎరగం రెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బద్వేల్: అట్లూరు మండలం వరికుంట పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

వరికుంట పంచాయతీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ నాయకుడు ఎరగం రెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.

టీడీపీలో చేరిన వారిలో..

ఎరగం రెడ్డి భాస్కర్ రెడ్డి, ఎరగం రెడ్డి బాలరెడ్డి, పాటూరు శివరాం రెడ్డి, పల్లె కృష్ణారెడ్డి, బుర్రి గోపికృష్ణ, గొర్ల రాజయ్య, గొర్రెలు ఏరుకులయ్య, రామ్ హరి ప్రసాద్, గొర్ల మురళి, గొర్ల వేణుగోపాల్, ఎరగం రెడ్డి ఓబుల్ రెడ్డి, పరుగుంట గోపాల్, వరికుంట సుబ్బరాయుడు, వరికుంట కృష్ణ, వరికుంట నాగమణి తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *