Tv424x7
Andhrapradesh

రైతుకు ఏటా 20వేల ఆర్థిక సాయం చేస్తాం – యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

నంద్యాల జిల్లా: నంద్యాల నియోజకవర్గం యాలూరులో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్ఎండి ఫరూక్ గారు*గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో యాలూరు మాజీ ఉప సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి , గంగుల శంకర్ రెడ్డి , కడ్డీల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ యాలూరు గ్రామంలో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పి అభివృద్ధిని విస్మరిచ్చిందన్నారు . రైతులకు సరైన సౌకర్యాలు కల్పించక వారికి నష్టపరిహారం చెల్లించడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు అలాగే యువతకు ఉపాధి కల్పించడంలో పరిశ్రమలు నెలకొల్పడంలో కూడా వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు కాబట్టి ప్రజలు వీటన్నిటిని గమనించి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు అదేవిధంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేకుంటే నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం వారి వారి జిల్లాలలో ఉచితంగా ఉంటుందన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి , నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు . ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భారీగా పాల్గొన్నారు

Related posts

పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ..

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

TV4-24X7 News

Leave a Comment