2019 ఎన్నికల్లో నవరత్నాల(Navaratnalu 2019) పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024(YSRCP Manifesto 2024)ను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలా వాటిని వైసీపీ కొనసాగించింది. వాటిని అప్‌డేట్ చేసింది. గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వాటిపై ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ… వాటిని పెంచేందుకు మొగ్గు చూపించింది. సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ… ఈసారి అదే మంత్రాన్ని నమ్ముకుంది. అయితే గత ఐదేళ్లలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చామని చెబుతున్నప్పటికీ కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్న విషయాన్ని గుర్తించింది. ముఖ్యంగా యువత, మహిళల కోసం ప్రత్యేక హామీలతో మేనిఫెస్టో రూపొందించారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024లోని ముఖ్యమైన పథకాలు ఇవే
రెండు విడతల్లో పింఛన్లు 3500లకు పెంపు
మహిళలకు హామీలు వైఎస్‌ఆర్ చేయూత కింద లక్ష యాభైవేల రూపాయలు
వైఎస్‌ఆర్ కాపు నేస్తం- రూ. 1.20,000
వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం- రూ. 1,05000
జగనన్న అమ్మఒడి – 17,000
వైఎస్‌ఆర్ ఆసరా కింద 3,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు