Tv424x7
Andhrapradesh

తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్టు– కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు

అనంతపురం :కంబదూరు మండలం వైసీపల్లి గ్రామానికి చెందిన సుంకమ్మను చంపిన ఆమె తనయుడు వెంకటేశులును అరెస్టు చేశామని కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు తెలిపారు. కంబదూరు ఎస్సై ఆంజనేయులతో కలిసి సి.ఐ వెల్లడించిన వివరాలు… సుంకమ్మ, రామదాసు దంపతులకు కొడుకు వెంకటేశులు ఉన్నాడన్నారు. ఇతను అనంతపురంలో ఉంటాడు. వీరికున్న స్థలం విషయంలో తల్లి, తండ్రి గొడవపడ్డారన్నారు. తల్లి కట్టెతో తండ్రిని కొట్టిందని… ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ అనంతపురం నుండీ వైసిపల్లికి వెళ్లి తండ్రిని ఎందుకు కొట్టావంటూ నిలదీశాడని సి.ఐ చెప్పారు. తల్లి ఎదురు చెప్పడంతో వెంకటేష్ కోపంతో సుంకమ్మ తలను గ్యాస్ బండకు గుద్దడంతో చనిపోయిందని సి.ఐ తెలిపారు. ఆమె భర్త రామదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడైన వెంకటేశులును అరెస్టు చేశామన్నారు.

Related posts

మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు..

TV4-24X7 News

ఏపీలో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

TV4-24X7 News

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

TV4-24X7 News

Leave a Comment