ఏలూరు జిల్లా:-కైకలూరు మండలం, గుమ్మాలపాడు గ్రామానికి చెందిన యాళ్ల. భీమరాజు s/o రాజారావు age 45 అను వ్యక్తి తన యొక్క ద్విచక్ర వాహనంపై ఆకువీడు నుంచి కైకలూరు వైపు వస్తూ ఉండగా రాత్రి సుమారు 8:30 సమయంలో ఉప్పుటేరు వంతెన దాటిన వెంటనే మృతుడు ప్రయాణం చేస్తున్న మోటార్ సైకిల్ ను వెనకనుంచి ఒక లారీ డ్రైవర్ ఆజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా లారి నీ నడిపి గుద్దడం తో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు చనిపోవడం జరిగింది. నేరస్థలo ను పరిశీలించిన కైకలూరు రూరల్ ఎస్సై టి. రామకృష్ణ కేసు నమోదు చేసి మృతున్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

previous post