విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా 5000 గుడ్డ సంచులను ఇప్పటివరకు పంపిణీ చేశారు, ఇంకా పదివేల గుడ్డ సంచులను పంపిణీ చేయుటకు గాను, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ చే గుడ్డ సంచులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, పర్యావరణ లో భాగంగా 10,000 గుడ్డ సంచులను పంపిణీ చేయడం, చాలా అభినచిన దగ్గ విషయమని, నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలను, పలు సేవా కార్యక్రమాలు గురించి తెలుసుకొని వివేకానంద సంస్థ వారిని, సంస్థ సభ్యులను అభినందిస్తూ, వివేకానంద సంస్థకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ ముఖ్య సభ్యులు బి . గజపతి స్వామి, కోశాధికారి సిహెచ్. పైడిరాజు , 39 వ వార్డు ప్రెసిడెంట్ చిన్న మరియు వివేకానంద సంస్థ మహిళా సభ్యులు పాల్గొన్నారు.

previous post
next post