ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 25.07.2024.ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గౌరవ నిధి మీనా ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ సందర్భంగా గౌరవ నిధి మీనా ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిధి మీనా కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
