విశాఖపట్నం జ్ఞానాపురం కూడలిలో వెలసిన ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం ఆషాఢ శుద్ధ అష్టమి ఆదివారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఈవో డీవీఎస్ సురేష్ బాబా ఆధ్వర్యంలో ఆలయ పూజారమ్మ వాసు పల్లి విజయమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలకంరించారు. ఆలయ అర్చకులు పులఖం డం శ్రీకాంత్ శర్మ ఉదయం నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు, విశేషార్చనలు, అభిషే కాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ప్రత్యేక ఉచిత దర్శనాలతో పాటు రూ. 10, రూ. 50 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది రామకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

previous post