Tv424x7
Andhrapradesh

సియం జగన్ లండన్ ఖర్చు గంటకు రూ.12 లక్షలు?

ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరుచుగా తాను పేదవాడినని చెబుతుంటారు. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానని, అందరూ ఈ పేదవాడివైపు నిలవాలంటూ పిలుపునిస్తుంటారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే ఫోన్ లేదని చెప్పారు.ప్రస్తుత లండన్ పర్యటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. పెత్తందారులంతా భూమి మీదే ఉన్నారని, పేదవాడు మాత్రం ఆకాశంలో విమానాల్లో ఉన్నాడంటూ పోస్టులమీద పోస్టులు పెడుతున్నారు. దీనిపై వైసీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున రెండుగా విడిపోయిన నెటిజన్లు సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు.గంటకు రూ.12 లక్షలు?వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ఇది వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. కానీ ఆయన రక్షణ కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాల్సి వస్తోంది. దాదాపు రెండువారాలు అక్కడే ఉండి జూన్ ఒకటిన తిరిగిరానున్నారు.విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ లండన్ వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలు. అంటే గంటకు రూ.12 లక్షలు ఖర్చుపెట్టే వ్యక్తి పేదవాడా? పెత్తందారా? అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కు రక్షణగా ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరత్రా ఖర్చులు కలిపి రూ.కోటిన్నర అవుతోంది. ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి. సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కాబట్టి ఆయన వరకు ఆయన ఖర్చుపెట్టుకున్నా భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.విమానానికి గంటకు రూ.12 లక్షలు చెల్లించడమంటే ఎన్నిరోజులు, ఎన్ని గంటలు అనేది లెక్కేస్తే కళ్లు తేలేసే అంత ఖర్చవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా చేజేతులా ప్రతిపక్ష పార్టీలకు విమర్శనాస్త్రాలను చేతికి అందించినట్లవుతోందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.

Related posts

35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

TV4-24X7 News

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.

TV4-24X7 News

జగన్ పై అనర్హత వేటు తప్పదా..?

TV4-24X7 News

Leave a Comment