విశాఖపట్నం పరవాడ తాడి మూడు మదాలు జంక్షన్ వద్ద గంజాయి 150 బ్యాగులతో 300 కేజీ లు గంజాయిని పట్టుకుని పరవాడ పోలీసులు సీజ్ చేశారు.. దీనికి సంబంధించి సిఐ బాల సూర్యరావు తెలిపిన వివరాల ప్రకారం తాడి మూడు మదాల వద్ద అనుమానంగా ఒక కారు ఆగి ఉందని వచ్చిన సమాచారం మేరకు పరవాడ సీఐ బాల సూర్యారావు ఆధ్వర్యంలో ఎస్సై మల్లేశ్వరరావు తన సిబ్బందితో కలిసిఅనుమానంగా ఆగి ఉన్న కారును పరిశీలించారు.. ఆ కారులో ఉన్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి తో పాటు కార్న్ మరియు 10 వేల రూపాయలు నగదును పరవాడ పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అయితే ఆ కార్ లో ఇద్దరు వ్యక్తులు ఉండగా ఒక వ్యక్తి పరార్ కాగా హైదరాబాదుకు చెందిన సంతోష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎస్ ఐ మల్లేశ్వరరావు, ఏ ఎస్ ఐ లు, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

