విశాఖపట్నం కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు ఆకుల రోజారాణి 30వ వార్డుకు చెందిన వైసిపి కార్యకర్త ఆకుల శ్యాంకుమార్ సతీమణి రోజా రాణి కి మెడికల్ ఖర్చులకు నిమిత్తం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం బాధితురాలకు నగదు అందజేసి భరోసా కల్పించారు. దక్షిణ ప్రజలకే కాకుండా తనతోపాటు అండగా నిలుస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులే నని, వారి కష్టాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాధితురాలు మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే వాసుపల్లి గణేష్ కుమార్ తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ దిలీప్, గురజాపు రవి, వేణు , కోరాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

previous post