కడప /ప్రొద్దుటూరు
ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందిన బండి భాస్కర్ రెడ్డి
ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లి గ్రామం లో నివాసం ఉంటున్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , బండి. విజయభాస్కర్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మిక మరణం…
ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుండెపోటు రావడంతో తన ఇంట్లోనే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు…విజయభాస్కర్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మిక మరణంతో పెద్దశెట్టిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయభాస్కర్ రెడ్డి నిత్యం ప్రజల కోసం పరితపించేవారు ప్రజల కోసం ఎప్పుడూ వారి పక్షాన నిలబడేవారు.అందరితో స్నేహభావంతో మెలిగేవారు ఆయన మరణ వార్త తెలియడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా పెద్ద యెత్తున తరలి వస్తున్నారు.

