విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ సింహాచల పుణ్య క్షేత్ర దర్శనం అదృష్టమని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని కపస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడి శివాలయంలో శివలింగానికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వయవతార రూపుడు సింహాచల చందన స్వామిని మా మత్స్యకారుల ప్రీతిపాత్రంగా కొలుస్తారన్నారు. సమస్త జనులకు ఆయురారోగ్యాలు సుఖసంతులు ఇవ్వాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు.
