Tv424x7
Telangana

తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!

న్యూఢిల్లీ: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఇచ్చే ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డులను ఈ ఏడాదికి గానూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను అందజేయనుంది. దేశవ్యాప్తంగా 463 మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీఆర్పీఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుంచి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి.

Related posts

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

TV4-24X7 News

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

TV4-24X7 News

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు

TV4-24X7 News

Leave a Comment