విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన లో భాగంగా రుషికొండ విచ్చేసిన సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఓల్డ్ సిటీ ని గ్రీన్ సిటీ గా మార్చడానికి తమ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా రుషికొండ భవనాలను సిఎం తో వెళ్లి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం లో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మంత్రులు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,టిడిపి పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

previous post