Tv424x7
Telangana

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి..శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ అలాగే పీజీ కాలేజీల బంద్ నకు డిగ్రీ కాలేజీల అసోసియేషన్…పిలుపు ఇవ్వడం జరిగింది..ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం ఇవాల్టి నుంచి… శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న అన్ని కాలేజీలు బంద్ కాబోతున్నాయి. బకాయిలు రిలీజ్ చేసే వరకు కాలేజీలు అసలు తెరిచేది లేదని అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. గతంలో కూడా.. అంటే అక్టోబర్ నెలలో నాలుగు రోజులపాటు కాలేజీలు మూసివేసి మరి… నిరసన తెలిపారు. ఆ సమయంలో నాలుగు రోజుల్లో డబ్బులు పడతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఇంకా పడలేదు. దీంతో ఈసారి ఉధృతంగా తమ ఉద్యమాన్ని చేస్తున్నారు డిగ్రీ కాలేజీ అసోసియేషన్ సభ్యులు..

Related posts

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

TV4-24X7 News

హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?

TV4-24X7 News

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment