జనవరి 7న ఏపీ రెడ్డి సంఘం ఆద్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ.- ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి- జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డిజనవరి 7వ తేదీన అనంతపురం నగరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 14 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప ఐటిఐ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నూతన కార్యవర్గన్ని రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహా వీరుడు విప్లవకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు . రాష్ట్రంలో రెడ్డి సంఘమును బలోపేతం చేసినందుకు ప్రతి రెడ్డి సోదరులు కృషి చేయాలని తెలిపారు . జనవరి ఏడవ తేదీన అనంతపురంలో జరిగే రెడ్ల మహాసభ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు .నూతన కార్యవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం రాంభూపాల్ రెడ్డి ,ఎల్ వి భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పొలిమేర అమర్నాథ్ రెడ్డి, మల్లేకుంట్ల గంగాసతీష్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, కార్యదర్శిగా భూమిరెడ్డి పల్లె వెంకట శివారెడ్డి,బొర్రా శివరామిరెడ్డి, సుధా అంకిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా సి .శివ శంకర్ రెడ్డి, కాజీపేట మండల అధ్యక్షులుగా మంచాల రాజ శేఖర్ రెడ్డి దువ్వూరు మండల అధ్యక్షులుగా పార్థసారధి రెడ్డి, రాజుపాలెం మండల అధ్యక్షులుగా మారేళ్ళ రామచంద్రారెడ్డి,కలసపాడు మండల అధ్యక్షులు గా రామకృష్ణారెడ్డి, సింహాద్రిపురం మండల అధ్యక్షులుగా అన్నవరం పక్కిరారెడ్డి,ప్రొద్దుటూరు మండల అధ్యక్షులుగా గజ్జల వేమారెడ్డి, మైలవరం మండల అధ్యక్షులుగా ప్రసాద్ రెడ్డి, చెన్నూరు మండల అధ్యక్షులుగా ఆవుల విజయభాస్కర్ రెడ్డి, వీరపునాయునిపల్లె మండల అధ్యక్షులుగా మొయిళ్ళ వేమనారాయణరెడ్డి, ముద్దనూరు మండల అధ్యక్షులుగా జూటూరు ప్రభాకర్ రెడ్డి ,లను నియమించినట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
