Tv424x7
Andhrapradesh

టీడీపీ ఎమ్మెల్యేలలో “షాడో బ్యాచ్” – జాగ్రత్తపడాల్సిందే!

తెలుగుదేశం పార్టీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉండటం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. వారందర్నీ పర్యవేక్షించడం తలకు మించిన భారం అవుతోంది. పెద్దగా పర్యవేక్షణ లేకపోవడంతో ఎమ్మెల్యేలు అంతా కట్టుతప్పుతున్నారు. వారు చేసే పనుల గురించి పక్కన పెడితే అసలు ఏ పనీ చేయకుండా నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడకుండా.. షాడో ఎమ్మెల్యేలతో పనులు చేయించేస్తూ రిలాక్స్ అవుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. షాడో ఎమ్మెల్యేలు అంతా ఆషామాషీ వ్యక్తులు కాదు. నియోజకవర్గాన్ని పిండేసేందుకు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.హైదరాబాద్ లో సేదదీరుతున్న ఎమ్మెల్యేలుటీడీపీ ఎమ్మెల్యేలలో చాలా మందికి హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయి. ఇతర వ్యవహారాలు ఉన్నాయి. తీరిక లేకుండా ఉండేవారు .. నియోజకవర్గానికి సమయం కేటాయించడం లేదు. పాలన అంతా ప్రభుత్వం చేసేస్తుంది కాబట్టి.. తమ పని ఏమీ లేదన్నట్లుగా ఉన్నారు. ప్రజలకు అందుబాటులోఉండటం లేదు. కనీసం ఇరవై, ముఫ్పై మంది ఎమ్మెల్యేలది ఇదే బాటగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక మందికి తెలంగాణలో వ్యాపారాలున్నాయి. అంతా సాఫీగా జరిగిపోతుంది కాబట్టి వారు నియోజకవర్గాల్లో కనిపించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు.షాడో ఎమ్మెల్యేలకు బాధ్యతలుతాము నియోజకవర్గంలో లేకపోయినా.. తమ పట్టు జారకూడదు కాబట్టి షాడో ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ఎమ్మెల్యేల తరపున అన్నీ ఆ షాడో ఎమ్మెల్యేనే చక్కబెడుతున్నారు. ఆయన కుటుంబసభ్యుడు కావొచ్చు.. పార్టీ నేత కావొచ్చు.ల అయితే అత్యధిక సందర్భంగాల్లో కుటుంబసభ్యుడే ఈ షాడో ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎక్కడెక్కడ ఎంతెంతో వసూలు చేసుకోవాలో చేసుకుంటున్నారు. ఈ షాడో ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రజల్లో అసహనం పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నెలకోసారి నియోజకవర్గంలో కనిపించడం గగనమే. ఇక కోస్తా ప్రాంతాల్లో వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సీనియర్లం అని.. ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించడం చిన్నతనం అని వీరనుకుంటున్నారు.హైకమాండ్ సరి దిద్దాల్సిందే !ఒకరిని చూసి ఒకరు.. ఎమ్మెల్యేలు బాధ్యతల నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు పరిమితమవుతున్నారు. ప్రజల్లోఉండాల్సిన వారు కనిపించడం లేదు. వీరి తీరుతో వారికి వ్యక్తిగతంగా ఎంత నష్టమో కానీ.. టీడీపీకి మాత్రం నష్టం జరుగుతోంది. ఇలాంటి ఎమ్మెల్యేలపై పూర్తి సమాచారం తెప్పించుకుని ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం కావాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related posts

దుఃఖంతో మాట్లాడుతున్నా: కేసీఆర్

TV4-24X7 News

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్

TV4-24X7 News

పూరీ జగన్నాథుని రత్నభండార్‌లో ఏముంది❓

TV4-24X7 News

Leave a Comment