Tv424x7
Sports

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..!!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లు మూడో సిక్స్ బాది క్రిస్ గేల్‌ను అధిగమించాడు. గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్.. సకీబ్ మహ్మూద్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టాడు. మహ్మూద్ వేసిన ఐదో ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించాడు.క్రిస్ గేల్ 301 వన్డే మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 335 సిక్స్‌లత కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు కొట్టాడు. మరో 16 సిక్స్‌లు బాదితే హిట్ మ్యాన్ అతన్ని కూడా అధిగమించనున్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోపు రోహిత్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 626 సిక్స్‌లు కొట్టాడు.ఈ మ్యాచ్‌లో 305 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Related posts

రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

TV4-24X7 News

ఐపీఎల్ 2024 వేలం మొదలయింది

TV4-24X7 News

ఆస్ట్రేలియా కెప్టెన్ ” పాట్ కమిన్స్ ” IPL చరిత్ర లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డ్

TV4-24X7 News

Leave a Comment